TG: వైద్యారోగ్యశాఖలో 633 ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి 21వ తేదీ సా.5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో పొరపాట్లు ఉంటే అక్టోబర్ 23 నుంచి 24 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసే అవకాశం కల్పించారు. నవంబర్ 30న CBT పద్దతిలో పరీక్ష ఉంటుందని వెల్లడించారు.