TG: MBBS, BDS ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. రేపటి నుంచి మొదటి విడత అడ్మిషన్ల వెబ్ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థుల ప్రాథమిక జాబితాను నిన్న కాళోజీ హెల్త్ వర్సిటీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఇవాళ సా.5లోపు తెలుపాలని వీసీ పేర్కొన్నారు. అభ్యంతరాలు పరిశీలించి రేపు తుది జాబితాను విడుదల చేసి, అదేరోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభిస్తామన్నారు.