నిహారిక కొణిదెల సమర్పణలో దర్శకుడు యాదు వంశీ తెరకెక్కించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ఆగస్టు 9న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇంకా ఈ మూవీ రేపటితో 50 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రేపు రాత్రి 7 గంటలకు HYDలోని మైత్రీ విమల్ థియేటర్లో స్పెషల్ షో వేయనున్నారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేస్తూ.. ఈ షోను మూవీ టీంతో కలిసి చూడవచ్చని మేకర్స్ తెలిపారు.