AP: అక్టోబరు 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 11, 12 తేదీలు మినహా.. 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు 2,84,309 అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాల కొరత కారణంగా పక్క రాష్ట్రాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేశారు.