బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా యువ పేసర్ ఆకాశ్ దీప్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా స్టార్ పేసర్ బుమ్రా నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని అన్నాడు. “బుమ్రాతో నేను ఎక్కువగా మాట్లాడుతుంటాను. అతడు అసాధారణమైన వ్యక్తి. దేవుడు అందరిలా కాకుండా ప్రత్యేకంగా తయారుచేశాడు. బుమ్రాకు ఎంతో అనుభవం ఉంది. అతడి అడుగుజాడల్లో నడవడం అంత సులభం కాదు” అని అన్నాడు.