GNTR: తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం రైతు సంఘం నేతలు ధర్నా చేపట్టారు. రైతు సంఘం రాజధాని డివిజన్ అధ్యక్షులు కే ఈశ్వర్ మాట్లాడుతూ.. ఆగస్టు 30, 31వ తేదీలలో భారీ వర్షాల వలన వ్యవసాయ పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. నష్టపోయిన మాగాని వరి పంటలకు ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.