JN: స్టేషన్ ఘన్పూర్లో శ్రీ సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య వేడుకలకు హాజరయ్యారు. బంజారా సమాజానికి మార్గదర్శిగా నిలిచిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం త్యాగం, సేవ, సమానత్వానికి ప్రతీక అని, బంజారా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేద్దామన్నారు.