2022లో దేశంలో షెడ్యూల్డ్ కులాల వారిపై జరిగిన మొత్తం దాడుల్లో 97.7 శాతం కేసులు 13 రాష్ట్రాల్లోనే నమోదైనట్లు ఓ ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. మొత్తం 52,886 కేసులు నమోదు కాగా 51,526 కేసులు 13 రాష్ట్రాలో నమోదైనట్లు పేర్కొంది. వాటిలో యూపీలో 12,287, రాజస్థాన్లో 8,651, మధ్యప్రదేశ్లో 7,732, బిహార్లో 6,799, ఒడిశాలో 3,576 దాడి ఘటనలు జరిగినట్లు చెప్పింది. అదే సమయంలో STలపై 9,735 దాడి ఘటనలు నమోదైనట్లు తెలిపింది.