NLG: నల్లగొండ పద్మానగర్ కాలనీ కి చెందిన భారతీయ జనతా పార్టీ చేనేత సెల్ రాష్ట్ర కన్వీనర్ మిర్యాల వెంకటేశం,బీజేపీ పట్టణ పార్టీ కన్వీనర్ గా నియమితులైన సందర్భంగా ఆదివారం పద్మశాలి సంఘం, బీసీ సంఘం, లైన్స్ క్లబ్ సభ్యులు వారి నివాసంలో ఘనంగా సన్మానించారు. గత 20 సంవత్సరాలుగా పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న ఆయనకు తగిన గుర్తింపు లభించడం సంతోషదాయకమని వారన్నారు.