టాలీవుడ్ హీరో నాగార్జున, హైదరాబాద్ మాదాపూర్ లో నిర్మించిన ‘N కన్వెన్షన్’ సెంటర్’పై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. 24 ఆగస్టు శనివారం హైదరాబాద్ అధికారులు కూల్చివేసిన ‘ఎన్ కన్వెంచన్ సెంటర్’ పై ఇటీవల కొన్ని మీడియా సంస్థలు సమాచారాన్ని ప్రసారించాయి. అయితే ఈ న్యూస్ ను కొన్ని ఛానెల్స్ వక్రీకరిస్తున్నాయి అనే భావన వాళ్ళో ఏమో… నాగార్జున ఈ విషయంపై ప్రజలకు అభిమానులు తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు. ఈ కన్వెన్షన్ సెంటర్ మధాపూర్ ప్రాంతంలో ఉన్న తమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించబడిందని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఆరోపణలపై నాగార్జున రెండు సార్లు స్పందించారు. ఈరోజు తన సోషల్ మీడియా ద్వారా ఆయన 2014 సంవత్సరంలో తీసుకున్న కోర్టు ఆదేశాల పత్రాలను సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆ ఆదేశాల ప్రకారం, ‘N Convention Centre’ నిర్మాణం కోసం ఎటువంటి భూభాగాన్ని కూడా అక్రమంగా ఆక్రమించలేదు అని కోర్టు స్పష్టంగా పేర్కొంది.
నిన్న నాగార్జున ఈ ఆరోపణలపై మరోసారి స్పందిస్తూ, అవి పూర్తిగా అబద్ధమని మరియు తమ ప్రాజెక్టు నియమాలు, నిబంధనలు అన్ని పాటిస్తూ నిర్మించబడిందని పేర్కొన్నారు. ఆయన ప్రజలకు తనవంతు నమ్మకాన్ని నిలిపి, అబద్ధపు ఆరోపణలకు నమ్మకమెరగకుండా, న్యాయస్థానం నుండి సానుకూల నిర్ణయం వచ్చే వరకు ఎదురుచూడాలని కోరారు.
మొత్తానికి నాగార్జున ఈ విషయంలో స్పీడ్ పెంచారని అనుకోవాలి. సైలెంట్ గా ఉండే అవాస్తవాలు జనం నమ్మే ప్రమాదం ఉందని భావించి ఉండొచ్చు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ ఈ విషయంపై స్పందించకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే