లైగర్ హిట్ అయితే సీన్ వేరేలా ఉండేది. విజయ్, పూరి పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకొని.. మరింత స్పీడ్‌తో ‘జనగణమన’ను తెరకెక్కించే వారు. కానీ లైగనర్ ఫ్లాప్ అవడంతో రౌడీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. లైగర్ ఎఫెక్ట్ విజయ్ అప్ కమింగ్ ఫిల్మ్స్ పై కూడా పడేలా ఉందంటున్నారు. అయితే లైగర్ ఫ్లాప్‌తో పని లేకుండా తన పని తాను చేసుకుంటు పోతున్నాడు విజయ్ దేవరకొండ. అంతేకాదు గోడకేసిన బంతిలా డబుల్ ఫోర్స్‌తో తిరిగొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఖుషి సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ ఉందా.. లేదా అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పక్కకు పెట్టేసినట్టేనని అంటున్నారు.
ఇక ఇప్పుడు సుకుమార్‌తో చేయబోయే ప్రాజెక్ట్ కూడా ఉండే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయట. లైగర్‌కు ముందే రౌడీతో సినిమా ప్రకటించాడు సుకుమార్. లైగర్ ప్రమోషన్లో కూడా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని పూరితో చెప్పాడు సుక్కు. కానీ ఇప్పుడు రౌడీతో సినిమా చేసేందుకు సుకుమార్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌ను దాదాపుగా పక్కకు పెట్టేశాడని ఇండస్ట్రీ టాక్. ‘పుష్ప’తో పాన్ ఇండియాను షేక్ చేసిన సుకుమార్.. ప్రస్తుతం ‘పుష్ప2’తో బిజీగా ఉన్నాడు. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటితే.. విజయ్‌తో సినిమా ఉండదని అంటున్నారు. అయితే ఇప్పుడే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేం. మరి రౌడీ నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి.