»Dhanush Reveals The Reason For His 150 Crore House In Poes Garden Chennai
Dhanush : పోయెస్‌గార్డెన్‌లో ఇల్లు అందుకే కొన్నా : ధనుష్
తాను చెన్నైలోని పోయెస్ గార్డెన్లో ఇల్లు కొనడం ఇంత హాట్ టాపిక్ అవుతుందని అనుకోలేదని హీరో ధనుష్ అన్నారు. అక్కడ తాను ఇల్లు కొనుక్కోవడానికి వెనక ఉన్న కారణాన్ని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఆయన ఏమన్నారంటే?
Dhanush : పోయెస్ గార్డెన్లో తాను ఇల్లు కొనుక్కున్న విషయమై హీరో ధనుష్(Dhanush) మాట్లాడారు. ‘రాయన్’ ప్రెస్మీట్లో భాగంగా ఆయన ఈ విషయమై స్పందించారు. పోయెస్ గార్డెన్లో ఇల్లు కొనుక్కోవాలనేది తనకు 16 ఏళ్లు ఉన్నప్పుడు కన్న కల అని చెప్పుకొచ్చారు. అందుకనే ఇప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయం ఇంత హాట్ టాపిక్ అవుతుందని అనుకోలేదని అన్నారు. ఇది తెలిసుంటే ఎక్కడో చిన్న ప్లాట్ కొనుక్కుని ఉండేవాడినని చెప్పారు.
తాను సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమానినన్న విషయం అందరికీ తెలిసిందే అని గుర్తు చేశారు. ఆయన ఇల్లు చూడటానికి చెన్నైలోని పోయెస్ గార్డెన్‌కు(Poes Garden) తాను వెళ్లే వాడినని చెప్పారు. జయలలితమ్మ కూడా అక్కడే ఉంటారని తెలుసుకుని చిన్నతనంలో తాను ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు. అప్పుడే తాను కూడా అక్కడ ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నట్లు చెప్పారు. అలా అప్పటి పదహారేళ్ల వెంకటేష్ ప్రభుకు(ధనుష్ అసలు పేరు) ఇప్పుడు ఈ ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ధనుష్(Dhanush) 2021లో చెన్నైలోని పోయెస్ గార్డెన్లో 150 కోట్లతో ఇల్లు కట్టించడం మొదలు పెట్టారు. అది 2023లో పూర్తయింది. ఆ విషయమై ఆయన ఇప్పుడు స్పందించారు.