A plane crashed in Kathmandu, the capital of Nepal
Nepal: శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిన సంఘటనలో ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మాండులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి ఓ విమానం టేకాఫ్ తీసుకుంది. కాసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన విమానంలో మొత్తం 19 మంది ఉన్నారు. టేక్ ఆఫ్ అయిన విమానం పోఖరాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి రన్వైనే ఈ ప్రమాదాన్ని పైలెట్ గుర్తించాల్సింది. కానీ వాస్తవ సంఘటనలు ఎవరికి తెలియవు. ముఖ్యంగా ఈ ప్రమాదానికి గల కారణాలను వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఇప్పటి వరకు 18 మృతదేహాలను వెలికి తీశారు. విమానం పైలట్ కెప్టెన్ మనీష్ షాక్యాను రక్షించిన సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు.