»Finance Minister Nirmala Sitharaman Meets President Droupadi Murmu At Rashtrapati Bhavan
Murmu : బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు నిర్మలమ్మ నోరు తీపి చేసిన ద్రౌపది ముర్ము
బడ్జెట్‌ని మంగళవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి ముందు నిర్మల సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు ప్రెసిడెంట్ నోరు తీపి చేశారు.
Droupadi Murmu : కేంద్ర ఆర్థిక మంత్రి( Finance Minister ) నిర్మల సీతారామన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోరు తీపి చేశారు. బడ్జెట్‌ని ప్రవేశ పెట్టే ముందు అనుమతి తీసుకోవడానికి నిర్మల రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ఆమెకు స్వీటు తినిపించి గుడ్ లక్ అని చెప్పారు. ఉదయం పదకొండు గంటల నుంచి పార్లమెంటులో ఆమె బడ్జెట్ ప్రసంగం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో బడ్జెట్ సమర్పణకు ద్రౌపది ముర్ము(Droupadi Murmu) నుంచి ఆమె అనుమతి తీసుకున్నారు.
మంగళవారం ఉదయం నార్త్ బ్లాక్‌లో ఉన్న ఆర్థిక శాఖకు నిర్మల తొలుత వెళ్లారు. అక్కడి నుంచి బహీఖాతాను తీసుకుని బయటకు వచ్చారు. ఎరుపు రంగు బహీఖాతాలో బడ్జెట్ దస్త్రాలను ఉంచి పార్లమెంటుకు తీసుకురావడం సంప్రదాయంగా వస్తోంది. ఆ డాక్యుమెంట్లను తీసుకుని తన టీంతో కలిసి నిర్మల రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. బడ్జెట్ కాపీలను ముర్ముకు అందజేశారు. అనంతరం రాష్ట్రపతి నిర్మలమ్మకు(Nirmala Sitharaman) నోరు తీపి చేసి, గుడ్‌లక్ చెప్పి పంపించారు.
#WATCH | Finance Minister Nirmala Sitharaman meets President Droupadi Murmu at Rashtrapati Bhavan, ahead of the Budget presentation at 11am in Parliament.