»Pm Modi The Budget To Be Introduced This Time Is Very Important
PM Modi: ఈసారి ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ అత్యంత కీలకమైనది
ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మాట్లాడారు. రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదని, దేశం కోసం ఉందన్నారు.
PM Modi: The budget to be introduced this time is very important
PM Modi: ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ మాట్లాడారు. రాజకీయాలు చేయడానికి పార్లమెంట్ వేదిక కాదని, దేశం కోసం ఉందన్నారు. మనం 2029 ఎన్నికల్లో మరోసారి తలపడదాం. అప్పటివరకు పార్లమెంట్‌ను మహిళలు, రైతులు, యువత జీవితాలను బాగు చేసేందుకు వాడదామని తెలిపారు. నిరంతరంగా సభలో గందరగోళం ఏర్పడటం వల్ల కొందరు సభ్యులు తమ పాయింట్లను చెప్పలేకపోతున్నారు.
ప్రజలు తీర్పు ఇచ్చేశారని మోదీ చెప్పారు. ఇక ఆ రాజకీయాల నుంచి పార్టీల బయటకు వచ్చి దేశం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈసారి ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ అత్యంత కీలకమైందని మోదీ తెలిపారు. వచ్చే ఐదేళ్లకు తమకు కార్యనిర్దేశం చేసేదిగా ఉండటంతో పాటు వికసిత్ భారత్‌కు ఇది పునాది వేస్తుందని చెప్పారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత మూడోసారి ఒకే ప్రభుత్వం అధికారం చేపట్టిందన్నారు.