»Bangladesh Government Orders Not To Shoot On Sight
Bangladesh: కనిపిస్తే కాల్చేయండని ప్రభుత్వం ఆదేశాలు
బంగ్లాదేశ్‌లో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తుండటాన్ని నిరసిస్తూ అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అయితే సర్కారు ఏకంగా షూట్ ఎట్ సైట్ ఆదేశాలను జారీ చేసింది.
Bangladesh: Government orders not to shoot on sight
Bangladesh: బంగ్లాదేశ్‌లో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తుండటాన్ని నిరసిస్తూ అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఆందోళనలను అణచివేసేందుకు బంగ్లా ప్రభుత్వం కర్ఫ్యూ విధించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇవాళ సర్కారు ఏకంగా షూట్ ఎట్ సైట్ ఆదేశాలను జారీ చేసింది. ఆందోళనలు చెలరేగిన అన్ని ప్రాంతాల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది.
ఆందోళనకారులపై భత్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 115 మంది మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం కొంత సేపు కర్ఫ్యూను సడలించింది. అయితే సడలింపు సమయంలోనూ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా సమావేశాలు, సభలపై నిషేధం విధించింది. అంతేగాక దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను కూడా నిషేధించింది. దాంతో బంగ్లాదేశ్‌కు చెందిన ఢాకా ట్రిబ్యూన్, డైలీ స్టార్‌తో సహా ప్రధాన వార్తా పత్రికలు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను అప్డేట్ చేయలేకపోతున్నాయి.