»Telangana Weather Heavy Rains For Two Days Orange Alert Issued In These Districts
Telangana Weather: రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. చిలికా సరస్సు సమీపంలో ఒడిశా తీరంలోని అల్పపీడనం కొనసాగుతుంది. దీంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Telangana Weather: Heavy rains for two days.. Orange alert issued in these districts
Telangana Weather: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. చిలికా సరస్సు సమీపంలో ఒడిశా తీరంలోని అల్పపీడనం కొనసాగుతుంది. వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా 12 గంటల్లో క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈరోజు నుంచి రేపటి వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దాంతో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గడిచిన 24గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములుగు జిల్లాలో వెంకటపురంలో అత్యధికంగా పది సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం నమోదైంది.