గత కొద్ది రోజులుగా ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పై వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విచారణ చేపట్టగా ఆమె పెద్ద మోసానికి పాల్పడినట్లు తెలిసింది.
Pooja Khedkar : గత కొద్ది రోజులుగా ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పై వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విచారణ చేపట్టగా ఆమె పెద్ద మోసానికి పాల్పడినట్లు తెలిసింది. పూజా ఖేడ్కర్ తన పేరును మార్చుకోవడమే కాకుండా తన తండ్రి, తల్లి పేర్లను కూడా మార్చినట్లు యూపీఎస్సీ విచారణ నివేదిక పేర్కొంది. ఆమె తన ఫోటోగ్రాఫ్, సంతకం, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, చిరునామాను మార్చుకుంది. దీనికి సంబంధించి యూపీఎస్సీ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీనిలో పూజా ఖేద్కర్ యూపీఎస్సీ పరీక్షలో ఎంపిక కోసం కమిషన్ నిబంధనల ప్రకారం అనుమతించబడిన గరిష్ట పరిమితి కంటే తక్కువ నమోదు చేసి దాని ప్రయోజనాన్ని పొందారని పేర్కొంది.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022 ట్రైనీ ఐపీఎస్ పూజా ఖేడ్కర్ ప్రవర్తనపై సమగ్ర దర్యాప్తు జరిగిందని కమిషన్ తెలిపింది. ఆమె తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటో/సంతకం, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, చిరునామాను మార్చి పరీక్ష నిబంధనలను ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విచారణ అనంతరం యూపీఎస్సీ ఆమె పై చర్యలు ప్రారంభించింది. ఇప్పుడు పూజా ఖేడ్కర్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఆమెపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది కాకుండా, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022 నిబంధనల ప్రకారం ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి.. భవిష్యత్తులో పరీక్షలకు హాజరుకాకుండా షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మరోవైపు రైతులను తుపాకీతో బెదిరించినందుకు పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్‌ను పుణె రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులను బెదిరించినందుకు మనోరమపై కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా రాయ్‌గఢ్ జిల్లా మహద్‌లోని ఓ హోటల్లో మనోరమను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా మనోరమ కోసం వెతుకుతున్నామని, ఆమె కోసం ముంబై, పూణేలోని పథర్డిలో వెతికామని పోలీసులు తెలిపారు. ఆమె మహద్‌లోని ఓ హోటల్లో దాక్కున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పుణె రూరల్ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ బృందం తెల్లవారుజామున హోటల్‌పై దాడి చేసి మనోరమను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.