Vijay Sethupathi: విడుదల 2.. విజయ్ సేతుపతి విశ్వరూపం!
ఒక హీరోని హీరోలా కాకుండా.. మనతో పాటే సమాజంలో ఎక్కడో ఓ చోట జీవిస్తున్నాడనేలా.. తన హీరోలను చూపిస్తాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి 'విడుదల పార్ట్ 2' రాబోతోంది. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
Vijay Sethupathi: మన మూలాలకు వెళ్లి మరీ.. న్యాచురల్‌గా సినిమాలు తీయడంలో వెట్రిమారన్ తర్వాతే ఎవ్వరైనా. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. రియాల్టికి దగ్గరగా సినిమాలు తీసి.. బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నారు. అసలు సమాజంలో ఇలాంటివి కూడా జరుగుతాయా.. అనే కోణంలో వెట్రిమారన్ సినిమాలు ఉంటాయి. చివరగా ‘విడుదల పార్ట్1’ అనే సినిమాను ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వెట్రిమారన్. ఈ సినిమాతో నటుడు సూరి హీరోగా మారాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించాడు.
తమిళం, తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా ఓకె అనిపించుకుంది. పలు అవార్డులు కూడా వరించాయి. అయితే.. ముందే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు వెట్రిమారన్. కానీ అనుకొని కారణాల వల్ల పార్ట్ డిలే అవుతూ వస్తోంది. ఫైనల్‌గా.. ఇపుడు ‘విడుదలై పార్ట్ 2’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే.. పార్ట్ 1లో సూరి పాత్ర పై ఫోకస్ పెట్టిన వెట్రిమారన్.. ఈసారి విజయ్ సేతుపతి రోల్‌ను హైలెట్ చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు.
అందులో.. ఒక పోస్టర్లో కత్తి పట్టి పరిగెడుతూ శత్రువులను వేటాడుతుండగా.. మరో పోస్టర్లో సినిమాలో తన భార్యతో కలిసి కనిపించాడు సేతుపతి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి భార్య పాత్రలో మంజు వారియర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మొత్తంగా.. విడుదలై 2 ఫస్ట్ లుక్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.