»Iran Threat Prompted More Security At Trump Rally As Officials Warn Of Potential For Copycat Attacks
trump : కొన్ని వారాల క్రితమే ట్రంప్‌ని చంపేందుకు ఇరాన్ కుట్ర : ఇంటిలిజెన్స్ రిపోర్ట్
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ కుట్ర పన్నింది. రెండు వారాల క్రితమే ఈ విషయంలో అక్కడి ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Iran Threat To Trump : అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై( donald Trump) గత వారంలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆయనను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందట. ఈ విషయమై అమెరికా ఇంటిలిజెన్స్ బ్యూరోకి రెండు వారాల క్రితమే సమాచారం అందిందట. ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్ బ్యూరో ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ హత్యకు కుట్ర సమాచారం నేపథ్యంలో ట్రంప్ ర్యాలీల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే 20 ఏళ్ల మ్యాథ్యూస్ అనే యువకుడు చేసిన కాల్పులకు, ఇరాన్ కుట్రకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ట్రంప్‌పై కాల్పుల ఘటనకు పూర్వమే ఇంటిలిజెన్స్‌కు(intelligence) ఈ రిపోర్ట్ అందింది. దీంతో ఆయనకు అప్పటికే సీక్రెట్ సర్వీస్ భద్రతను పెంచింది. అయినప్పటికీ ఓ యువకుడు ఆయనపై దాడికి దిగాడు. ఏదేమైనప్పటికీ ట్రంప్‌కు ముప్పు పొంచి ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్ సుప్రీం కమాండ్ ఖాసిం సులేమానీని డ్రోన్ దాడి చేసి హతమార్చారు. అప్పటి నుంచి ఇరాన్ నుంచి ట్రంప్‌కు ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉంటున్నాయి.
అమెరికా పాలకులు, వ్యక్తులపై వచ్చే ఎలాంటి బెదిరింపులనైనా చాలా తీవ్రంగా పరిగణిస్తామని అక్కడి ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగానే ట్రంప్ సెక్యూరిటీని(security) సైతం పెంచినట్లు చెప్పాయి. ఇరాన్ నుంచి ముప్పుపై(Iran threat) సెక్యూరిటీ అధికారులు నిఘా పెట్టి ఉంచారని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ వెల్లడించారు.