»Praneeth Hanmanthu Youtuber Praneeth Remanded For 14 Days
Praneeth Hanmanthu: యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్
తండ్రి, కూతురు బంధానికి అశ్లీల మాటలు మాట్లాడిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రణీత్‌కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
Praneeth Hanmanthu: YouTuber Praneeth remanded for 14 days
Praneeth Hanmanthu: తండ్రి, కూతురు బంధానికి అశ్లీల మాటలు మాట్లాడిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రణీత్‌కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ప్రణీత్‌పై 67బీ ఐటీ యాక్ట్, ఫోక్స్ యాక్ట్, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రణీత్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకోగా.. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా హైదరాబాద్ తీసుకువచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఏ2గా డల్లాస్ నాగేశ్వరరావు, ఏ3గా బుర్రా యువరాజ్, ఏ4గా సాయి ఆదినారాయణను చేర్చారు.
ప్రణీత్ హన్మంతు ఓ యూ ట్యూబ్ ఛానెల్లో కంటెంట్ క్రియేటర్‌గా ఉన్నాడు. డార్క్ కామెడీ పేరుతో అనే విషయాలపై కామెంట్లు చేస్తూ ఫన్ జనరేట్ చేస్తుంటాడు. అతనితో పాటు తన స్నేహితుల కలిసి జూమ్ కాల్లో మాట్లాడుతూ రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటారు. ఓ తండ్రి తన కూతుర్ని కొట్టడానికి బెల్ట్ తీస్తాడు. తరువాత బెల్ట్‌పై ఊయల ఊపుతాడు. దానిపై తన స్నేహితులు చెత్త కామెంట్స్ చేశారు. ఆ వీడియోను హీరో సాయి దుర్గ తేజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ట్యాగ్ చేస్తూ దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వెంటనే సీఎం రేవంత్ స్పందించారు. తరువాత మంచు మనోజ్, ఇతర సినీ సెలబ్రెటీలు స్పందించారు. దీంతో ఇతనిపై కేసు నమోదు చేశారు.