సామాజిక మాధ్యమాల్లో పిల్లలపై అబ్యూజింగ్, వాళ్ల మీద కామెంట్లు చేయడం రోజురోజుకి పెరుగుతుంది. ఈ సోషల్ మీడియా ద్వారా పిల్లల లైంగిక వేధింపుల కంటెంట్‌ను కొందరు విక్రయిస్తున్నారు.
Child Abuse Videos: సామాజిక మాధ్యమాల్లో పిల్లలపై అబ్యూజింగ్, వాళ్ల మీద కామెంట్లు చేయడం రోజురోజుకి పెరుగుతుంది. అయితే ఓ మైనర్ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కి ఓ నగ్నవీడియోను పంపింది. కొన్ని నిమిషాల సమయంలోనే ఆ వీడియో తరగతి గదిలోని ఇతర అబ్బాయిల మొబైల్‌కు షేర్ అయ్యింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బాలుడి తల్లిదండ్రులను కలిసి వీడియో తొలగించమని కోరుకున్నారు. వెంటనే అతను ఆ వీడియో తొలగించాడు. కానీ ఇంటర్నెట్లో ఉంది. ఇలాంటివి ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్ ఫ్లాట్ఫారమ్ల నుంచి పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌లను తీసివేసేందుకు ప్రయత్నించారు.
పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ కంటెంట్‌ను సృష్టించి వినియోగిస్తున్న వారిలో ఇండియా ఒకటి. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్, ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్, ఇంటర్నెట్లె అప్లోడ్ చేసిన ఆన్లైన్ చైల్డ్ లైంగిక వేధింపుల మెటీరియల్ సంఖ్యను తెలుపుతూ ఓ నివేదిక విడుదల చేశారు. 1,987,430 కంటెంట్లు దేశం నుంచి సృష్టించారు. ప్రపంచంలోనే ఇదే అత్యధికం. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం కింద కఠినమైన శిక్షలు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో లైంగిక వేధింపుల కంటెంట్ నిండి ఉంది. పిల్లల లైంగిక చిత్రాలను పోస్ట్ చేసే ఇన్స్టాగ్రామ్ ఖాతాలు వీక్షకులను టెలిగ్రామ్ ఛానెల్‌కు దారితీస్తాయి.
ఇందులో పిల్లల లైంగిక వేధింపుల కంటెంట్‌ను రూ.40 నుంచి రూ.5000 వరకు విక్రయిస్తారు. ఈ కంటెంట్‌ను షేర్ చేయడానికి ఫేక్ ఐడెంటిటీని తయారు చేశాడు. పిల్లల లైంగిక వేధింపుల వీడియోలను విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించే మార్గాల్లో ఇది ఒకటి. ఇలాంటివి రోజుకి ఎన్నో జరుగుతున్నాయి. అయితే వీటిపై కొందరు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. 2020లో పిల్లలపై లైంగిక వేధింపుల మెటీరియల్‌ను కలిగి ఉన్నారని 43 మందిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కానీ వాళ్లు మళ్లీ బెయిల్‌పై విడుదలయ్యారు. పిల్లలను కాపాడాలంటే తల్లిదండ్రులు సోషల్ మీడియాలకు కొంచెం దూరంగా ఉండాలి.