PM Modi: Austria's Prime Minister of India after decades!
PM Modi: భారత ప్రధాని మోదీ నేడు ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. మన దేశ ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 1983లో ఇందిరాగాంధీ ఆ దేశాన్ని సందర్శించారు. మళ్లీ మోదీ సందర్శించడం గమనర్హం. ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మెర్తో మోదీ భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇరు దేశాలు దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకోనున్నాయి. అద్భుతమైన స్వాగత ఏర్పాట్లు చేసినందుకు ఛాన్సలర్ కార్ల్ నెహమ్మెర్కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాలు కలిసి ప్రపంచం కోసం పనిచేస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా మోదీ వియన్నా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత హోటల్లో బస చేయడానికి బయలు దేరారు. ఈ హోటల్కి చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ భారతీయ ప్రజలను కలిశారు. హోటల్లో ప్రధానికి స్వాగతం పలికేందుకు వందేమాతరం ట్యూన్ వినిపించారు. మోదీ ఈరోజు ఆస్ట్రియాలో చాలా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అక్కడ నివసిస్తున్న భారతీయులతో కూడా సంభాషించనున్నారు.