గతకొన్ని రోజుల నుంచి త్రిపురలోని హెచ్ఐవీ కలకలం రేపుతుంది. విద్యార్థులపై ఈవ్యాధి తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ వ్యాధి బారిన పడిన 47 మంది విద్యార్థులు మరణించారు. అయితే మొత్తం 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ సోకినట్లు త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది.
HIV: గతకొన్ని రోజుల నుంచి త్రిపురలోని హెచ్ఐవీ కలకలం రేపుతుంది. విద్యార్థులపై ఈవ్యాధి తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ వ్యాధి బారిన పడిన 47 మంది విద్యార్థులు మరణించారు. అయితే మొత్తం 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ సోకినట్లు త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది. ఉన్నత చదువుల కోసం త్రిపురకు చెందిన పలువురు విద్యార్థులు దేశంలోని చాలా ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో దేశంలోని ఇతర ప్రాంత విద్యార్థులకు ఈ వ్యాధి సోకే ప్ర్రమాదముంది.
త్రిపురలోని 220 స్కూళ్లు, 4 కాలేజీ, యూనివర్సిటీల్లోని విద్యార్థులు సూదుల ద్వారా ప్రమాదకరమైన డ్రగ్స్‌కు అలవాటుపడినట్లు గుర్తించారు. దీని ద్వారా ఈ వ్యాధి సోకుతుందని టీఎస్ఏసీఎస్ జాయింట్ డైరెక్టర్ భట్టాచార్య తెలిపారు. ప్రతిరోజూ ఐదు నుంచి ఏడు వరకు కొత్త హెచ్ఐవీ కేసులు కనిపిస్తున్నాయి. అయితే ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎక్కువగా సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలే అధిక సంఖ్యలో ఉన్నారు.