»Prabhas Raja Saab Makers Clarifies About Fake News
Raja Saab : రాజాసాబ్ విషయంలో వస్తున్న ఫేక్ వార్తల్ని నమ్మొద్దంటున్న మేకర్స్
గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాకి సంబంధించి వస్తున్న ఫేక్ వార్తల్ని నమ్మొద్దంటూ మేకర్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Raja Saab : కల్కి సినిమా విజయంతో మంచి ఊపు మీద ఉన్నారు హీరో ప్రభాస్. పాన్ ఇండియా హీరోగా, గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్(Prabhas ) తాజా చిత్రం రాజా సాబ్. మారుతి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం గురించి వస్తున్న ఫేక్ వార్తల్ని(Fake News ) నమ్మవద్దని చిత్ర మేకర్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ ఫేక్ న్యూస్‌పై క్లారిటీ ఇస్తున్నారు.
రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కి జంటగా మలయాళ హీరోయిన్ మాళవికా మోహనన్ నటిస్తోంది. ప్రభాస్‌కు తాతయ్యగా సంజయ్‌దత్ కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయంటూ నెట్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు ఆడిషన్స్ లాంటివి ఏమీ జరగడం లేదని చిత్ర మేకర్స్ చెబుతున్నారు. ఎవరూ ఇలాంటి వార్తల్ని నమ్మవద్దని అంటున్నారు. అలాంటిది ఏమైనా ఉంటే తామే స్వయంగా మీడియా ముందుకు వస్తామని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ రాజాసాబ్(Raja Saab) మూవీకి సంబంధించిన పోస్టర్ కూడా ఇటీవల విడుదలైంది. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. 2025 సంవత్సరం సంక్రాంతి సీజన్లో దీన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాతోపాటుగా ప్రభాస్ సలార్2, స్పిరిట్ వంటి సినిమాల్లోనూ తాజాగా నటిస్తున్నారు. ప్రస్తుతం కల్కి 2898ఏడీ (Kalki 2898 AD) చిత్రం కలెక్షన్ల రికార్డుల్ని బద్ధలుగొడుతోంది. వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందని అంతా భావిస్తున్నారు.