Imran Khan: Relief to former Prime Minister of Pakistan in Toshakhana case
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఊరట లభించింది. అతనిని వెంటాడిన తోషాఖానా కేసులో ఆయనకి విముక్తి లభించింది. 2022లో తోషాఖానా అవినీతికి సంబంధించి ఆయనని ఎన్నికల కమిషన్ అనర్హుడిగా ప్రకటించడంతో నిరసన ప్రదర్శన జరిపారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు నుంచి ఇమ్రాన్‌తో పాటు ఆయన పార్టీ సీనియర్ నేతలను ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు విముక్తుల్ని చేసింది. ఇతర దేశాల అధినేతల నుంచి పాకిస్థాన్ పాలకులకు అందే బహుమతులను ఇమ్రాన్ అమ్ముకున్నారనే ఆరోపణ వచ్చింది. ఈ కేసులో ఇమ్రాన్‌కు ఆగస్టు 5న మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. దీన్ని ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది. తోషాఖానా అంటే ఇతర దేశాల అధినేతల నుంచి పాకిస్థాన్ పాలకులకు అందే బహుమతులను భద్రపరిచే ఖజానాను తోషాఖానా అంటారు.