MDK: నిజాంపేట మండలం నందిగామలో కుంగిన బ్రిడ్జి ప్రయాణికులకు శాపంగా మారింది. అధికారులు వేసిన తాత్కాలిక రహదారి అధ్వానంగా తయారవ్వడంతో రామాయంపేట-సిద్దిపేట మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం వేల వాహనాలు తిరిగే ఈ మార్గంలో భారీ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత బ్రిడ్జి పనులు ప్రారంభించాలని కోరారు.