ఓ విమాన ప్రయాణికుడు టర్బులెన్స్ కారణంగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. గాల్లో వచ్చిన విపరీతమైన టర్బులెన్స్ వల్ల విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. దీంతో అతడు రూఫ్‌కి గుద్దుకుని అక్కడే ఇరుక్కుపోయాడు. మిగిలిన ప్రయాణికులకు సైతం ఫ్రాక్చర్లు అయ్యాయి.
severe turbulence on Air Europa flight : విమాన ప్రయాణంలో టర్బులెన్స్‌ని( turbulence) ఎయిర్ పాసింజర్లు అంతా పేస్ చేసే ఉంటారు. అయితే ఓ విమానంలో టర్బులెన్స్ వల్ల తీవ్రంగా కుదుపులు వచ్చాయి. దీంతో పలువురుకి మెడ, స్కల్ ఎముకలు ఫ్యాక్చర్ అయ్యాయి. ఓ ప్రయాణికుడు కుదుపులకు సీటు నుంచి ఎగిరి రూఫ్‌లో చిక్కుకుపోయాడు. పైన ఉండే ఓవర్‌హెడ్ బిన్‌లోకి అతడి తల వెళ్లి దూరిపోయింది. దీంతో తర్వాత అతడిని పక్కనున్న వారు లాగి కిందికి దించారు.
ఈ ఘటన ఎయిర్ యూరోపా(Air Europa)కు చెందిన బోయింగ్ 787-9 విమానం స్పెయిన్ నుంచి ఉరుగ్వే దేశానికి బయలుదేరింది. ఆ సమయంలో అది తీవ్రమైన టర్బులెన్స్‌కి( turbulence) లోనైంది. పైలెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటూ హెచ్చరించాడు. అయినా కొంత మంది ప్రయాణికులు సీట్ బెల్టులు పెట్టుకోలేదు. మరి కొందరు వదులుగా పెట్టుకున్నారు. దీంతో ఆ కుదుపులకు ప్రయాణికులు ఎగిరెగిరి పడ్డారు. ఓ ప్రయాణికుడైతే రూఫ్‌కి ఉండే ఓవర్ హెడ్ బిన్‌లోకి దూరిపోయాడు. తర్వాత అతడిని పక్క ప్రయాణికులు, సిబ్బంది కిందికి దించారు.
ఈ కుదుపులతో విమానంలో భయంకర వాతావరణం నెలకొంది. చిన్న పిల్లలు ఏడవడం మొదలు పెట్టారు. దీంతో బ్రెజిల్‌లోని నాటల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుల్లో మొత్తం 36 మంది గాయపడ్డారు. వారిలో కొందరికి మెడ, తల ఎముకలు ఫ్యాక్చర్ అయ్యాయి. దీంతో అవసరమైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మరి కొందరికి ఎలాంటి దెబ్బలూ తగలకపోయినా వారంతా షాక్‌లో ఉన్నారు. మానసికంగా భయాందోళనల్లో ఉన్నారు. మిగిలిన ప్రయాణికుల్ని ప్రత్యేక విమానం ద్వారా గమ్య స్థానానికి పంపించే ఏర్పాట్లు చేశారు.