»Turbulence Hits Air Indias Delhi Sydney Flight Flyers Injured
Turbulence hits flight:కుదుపునకు గురైన ఎయిర్ ఇండియా విమానం.. పలువురికి గాయాలు
సిడ్నీ బయల్దేరిన ఎయిరిండియా విమానం భారీ కుదుపునకు గురయ్యింది. అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారికి విమానం గాలిలో ఉండగానే ప్రథమ చికిత్స చేశారు.
Turbulence hits Air India’s Delhi-Sydney flight, flyers injured
Turbulence hits flight:ఎయిర్ ఇండియా (Air India) విమానం భారీ కుదుపునకు గురయ్యింది. ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియా వెళుతున్న విమానం కుదుపునకు గురవడంతో ప్రయాణికులు భయపడ్డారు. పలువురు గాయపడ్డారు (wound) కూడా.. ఏడుగురికి స్వల్ప గాయాలు అయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.
ఎయిర్ ఇండియాకు (air india) చెందిన బీ787-800 విమానం సిడ్నీ బయల్దేరింది. విమానం గాలిలో ఉండగా ఒడిదొడుకులకు లోనయ్యింది. అందులో ఉన్న ప్రయాణికుల్లో కొందరు భయపడ్డారు. వెంటనే అక్కడికి వచ్చిన విమాన సిబ్బంది వైద్యుడు, నర్స్ సాయంతో ప్రథమ చికిత్స చేశారు.
విమానం (flight) సిడ్నీ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే వైద్య పరీక్షలు నిర్వహించారు. భయపడ్డ ఏడుగురిలో ముగ్గురు వైద్య సాయం తీసుకున్నారని.. ఇతరులకు ఆస్పత్రిలో చేర్చే అవసరం లేదట. ఈ విషయాన్ని సిడ్నీలో ఎయిరిండియా మేనేజర్ ఒకరు తెలిపారు.