»Vladimir Putin In North Korea Kim Jong Uns Soulful Embrace Photo Goes Viral
Vladimir Putin: ఉత్తర కొరియాలో పుతిన్.. కిమ్ ఆత్మీయ ఆలింగనం.. ఫోటో వైరల్
దాదాపు రెండున్నర దశాబ్దం తరువాత ఉత్తరకొరియాలో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎయిర్‌పోర్టులో కిమ్ ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఘన స్వాగతం పలికారు. అనంతరం ఒకే కారులో సదస్సుకు బయలు దేరారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Vladimir Putin in North Korea.. Kim Jong Un's soulful embrace.. Photo goes viral
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఉత్తర కొరియాలో అడుగుపెట్టారు. నార్త్ కొరియా అధ్యక్షడు కిమ్ జాంగ్ ఉన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తరువాత పుతిన్ ఆ దేశానికి వెళ్లారు. అరుదైన సదస్సుకు హాజరైన ఆయన్ను ఉత్తరకొరియా ప్రజలు పెద్ద ఎత్తున సాదరస్వాగతం పలికారు. ముందుగా ప్యోంగ్యాంగ్ ఎయిర్ పోర్టులో దిగిన పుతిన్‌ను కిమ్ ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఒకే కారులో సదస్సుకు బయలు దేరారు.
అమెరికాను ఎదుర్కోవడానికి రష్యాకు పొరుగు దేశాల బలం కావాలి. అందులో భాగంగానే పుతిన్ ఉ. కొరియాతో సంబంధాలు బలపరుచుకుంటున్నారు. దీనిలో భాగంగా పుతిన్ రాజధాని ప్యోంగ్యాంగ్ చేరుకున్నారు. ఈ క్రమంలో తైడాంగ్ నది పక్కనున్న స్క్వేర్ వద్ద పుతిన్‌కు సైనిక వందనం లభించింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ వేడుకలో బెలూన్లతో చిన్నారులు, గ్రాండ్ పీపుల్స్ స్టడీ హాల్లో జాతీయ జెండాలతో కూడిన ఇద్దరు నేతల భారీ చిత్రపటాలు ఉన్నాయి. ఇక అటునుంచి చర్చల కోసం కిమ్, పుతిన్ ఇద్దరూ కుమసుసాన్ ప్యాలెస్‌కు వెళ్లారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో నార్త్ కొరియా అందిస్తున్న మద్దతుకు పుతిన్ కృతజ్ఞతలు తెలిపినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ భాగస్వామ్యం ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉంటుందని కిమ్ పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి.
🇰🇵 First footage has been released showing the historic meeting between Russian President Vladimir Putin and North Korean leader Kim Jong-un at Kim Il Sung Square in Pyongyang. pic.twitter.com/adAQlOQZiQ