»Indian Finalist At Worlds First Ai Beauty Pageant Zara Shatavari
Miss Al : ‘మిస్ ఏఐ’ ఫైనలిస్టుల్లో భారత ఏఐ సుందరి.. జారా శతావరి!
ఇప్పుడు అందాల పోటీలు వరల్డ్ బ్యూటీలకే కాదు.. ఏఐ సృష్టించిన అందాల భామలకూ జరుగుతున్నాయి. అలా మన భారతీయులు సృష్టించిన జారా శతావరి మొదటి ఏఐ అందాల పోటీల్లో ఫైనలిస్టుగా ఎంపికైంది. ఆసక్తికరమైన ఆ విశేషాలను ఇక్కడ చదివేయండి.
World’s First AI Beauty Pageant : అందాల పోటీలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందమైన భామలకు జరిగే మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ లాంటి పోటీలకు దీటుగా ఇప్పుడు మరో కొత్త రకం పోటీలు తెర మీదకొచ్చాయి. అవే మిస్ ఏఐ.. ఇప్పటికే చాలా మందికి అర్థం అయి ఉండొచ్చు. ఇటీవల కాలంలో నెట్లో ఏఐ ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. చాలా మంది తమ ఫోటోలను సైతం ఏఐ ఫోటోలుగా మార్చి చూసుకుని మురిసిపోతున్నారు. అలా ఏఐ సృష్టించిన అందమైన భామలకు ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి సారి పోటీ జరుగుతోంది. అందులో మన భారత ఊహా సుందరి జారా శతావరి(Zara Shatavari) ఫైనలిస్టుల జాబిలో చేరిపోయింది.
జారా శతావరి అనే అందాల డిజిటల్ బొమ్మ ఫోటోను మన దేశానికి చెందిన ఓ మొబైల్ యాడ్ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ చౌదరీ క్రియేట్ చేశారు. 2023 ఆగస్టు నుంచి జారా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. పీసీఓస్, డిప్రెషన్ లాంటి మహిళలు ఎదుర్కోనే అనేక సమస్యలపై సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది.మరో సంస్థకు ఇన్ఫ్లయెన్సర్ మార్కెటింగ్ మేనేజర్‌గా చేరింది. ఇప్పుడు ఆమె ఇన్‌స్టా ఖాతాలో 7500 మంది ఫాలోవర్లు ఉన్నారు.
సోగ కళ్లతో, కోల ముఖంతో ఉన్న జారా అంతర్జాతీయ బ్యూటీ పేజెంట్‌లో 1500 మంది ఏఐ భామల్ని వెనక్కినెట్టి పది మంది ఫైనలిస్టుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ మిస్ ఏఐ పోటీలను ప్రపంచంలోనే మొదటి సారి ఫ్యాన్ వ్యూ అనే సంస్థ నిర్వహిస్తోంది. అమ్మాయిలు కాదంటే నమ్మలేనట్లుగా ఉన్న వీరి అందం చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు ఈ టాప్ 10 జాబితా నుంచి ఒకరిని సెలక్ట్ చేసి ‘మిస్ ఏఐ’ టైటిల్‌ని ప్రదానం చేస్తారు.