Apple Watch : సిరిసిల్ల బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గుండె పోటు ప్రమాదం నుంచి బయటపడ్డారు. యాపిల్ వాచ్ ఇచ్చిన అలర్ట్‌తో ఆయన అప్రమత్తం అయ్యారు. వైద్యుల్ని సంప్రదించారు. దీంతో ఆయన తెలుసుకున్న విషయం షాక్‌కు గురి చేసింది. ఇంతకీ ఏమైందంటే… రామకృష్ణ చాలా రోజులుగా ఆయాసంతో ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా నడిస్తేనే ఆయాసం, ఛాతీలో మంటగా అనిపించడం లాంటివి గమనించారు. అయినా పెద్దగా పట్టించుకోలేదు.
గత కొంత కాలంలో ప్రతాప రామకృష్ణ( pratapa ramakrishna) రోజూ యాపిల్ స్మార్ట్ వాచ్‌ని(Apple Watch) పెట్టుకుంటున్నారు. రెండు రోజుల క్రితం అంటే సోమవారం యాపిల్ వాచ్(Apple Watch) ఆయనకు ఓ అలర్ట్ మెసేజ్ ఇచ్చింది. ఛాతీలో ఇబ్బంది ఉన్నదని వైద్యల్ని సంప్రదించాలని మెసేజ్ సారాంశం. దీంతో ఆయన అప్రమత్తం అయ్యారు. వరంగల్‌లో ఉన్న వైద్యుల్ని సంప్రదించారు.
ఆయనకు డాక్టర్లు అన్ని పరీక్షలూ నిర్వహించారు. గుండెకు సంబంధించిన రెండు రక్త నాళాలు మూసుకుపోయాయని తెలిపారు. భవిష్యత్తులో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుందని మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాదు వెళ్లాలని వారు సూచించారు. దీంతో మంగళవారం ఆయన హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుల సలహాతో చికిత్స తీసుకున్నారు.కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసార్రావు తదితరులు ఆయనను పరామర్శించారు. ఆరోగ్యం విషయం అడిగి తెలుసుకున్నారు.