»Minister Ktr Started Agriculture College In Sirisilla
Agriculture College : సిరిసిల్ల లో వ్యవసాయ కళాశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా (Sirisilla District) తంగళ్లపల్లి మండలం జిల్లెల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల (College of Agriculture) నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్ (Minister ktr), నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు.అనంతరం కొత్త భవనలను మంత్రులను పరిశీలించారు. తంగళ్లపల్లి(Tangallapally) మండలంలోని జిల్లెల్ల శివారులో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 69.50 కోట్లతో సకల వసతులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా (Sirisilla District) తంగళ్లపల్లి మండలం జిల్లెల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల (College of Agriculture) నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్ (Minister ktr), నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కొత్త భవనలను మంత్రులను పరిశీలించారు. తంగళ్లపల్లి(Tangallapally) మండలంలోని జిల్లెల్ల శివారులో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 69.50 కోట్లతో సకల వసతులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. ఈ కళాశాల రాష్ట్రంలోనే రెండోది. వ్యవసాయ కళాశాల వల్ల ఇటు వ్యవసాయ శాస్త్రవేత్తలు (Scientists) తయారు కావడమే కాకుండా, పేద, మధ్య తరగతి విద్యార్థులకు వరంగా మారనున్నది. ఈ నేపథ్యంలో సాంకేతిక విద్య వ్యవసాయంలో నిర్ణయాత్మక పాత్రను పోషించే అవకాశమున్నది. 2018 ఆగస్టు 9న తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో వ్యవసాయ కళాశాల భవనాల సముదాయానికి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అదే ఏడాది పీజీటీఎస్‌ఏసీ ఆధ్వర్యంలో ఎంసెట్ ద్వారా విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభం కాగా, సర్దాపూర్(Sardapur)లోని వ్యవసాయ పాలిటెక్నిల్ కళాశాల(Polytechnic College)లో తరగతులను ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌లో 56 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, వారు 2022 ఆగస్టులో వ్యవసాయ డిగ్రీలో పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం 23 మంది బోధన, 19 మంది బోధనేతర సిబ్బంది ఈ డిగ్రీ కళాశాలలో సేవలు అందిస్తున్నారు. కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్(Education Hub)గా అభివృద్ధి చెందుతున్నది ఒకవైపు ఎడ్యుకేషన్ హబ్, మరోవైపు పరిశ్రమల రాకతో ఇండస్ట్రియల్ హబ్(Industrial hub)గా నిలువడంతో పాటు వేలాది మందికి ఉపాధి లభించనున్నది. ఈ కార్యక్రమంలో శాసనసభా సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరయ్యారు.