Sai Pallavi: స్పాట్ నుంచి సాయి పల్లవి వీడియో లీక్?
షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన సాయి పల్లవి వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో సాయి పల్లవిని చూస్తే.. బాబాయ్ ఇంత సింపుల్‌గా ఉంటుందా? అని అనిపించక మానదు. ఇంతకీ ఏ సినిమా నుంచి లీక్ అయ్యాయి.
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్‌కు దూరంగా ఉంటూ, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు చేస్తుంటుంది. ఒకవేళ కాదు, కూడదు అంటే, ఎంత పెద్ద హీరో సినిమా అయిన సరే రిజెక్ట్ చేస్తుందనే టాక్ ఉంది. అందుకే.. సాయి పల్లవి సినిమా ఒప్పుకుంటే అందులో విషయం ఉన్నట్టేనని అంటారు. కాస్త గ్యాప్ తర్వాత సాయి పల్లవి తెలుగులో చేస్తున్న సినిమా తండేల్. ఇప్పటి వరకు నాగ చైతన్య అటెంప్ట్ చేసిన మాస్ సినిమాల కంటే భారీగా, చైతూ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తూ ఉండటంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.
లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా ఇదే. రీసెంట్గా వచ్చిన తండేల్ ఫస్ట్ గ్లింప్స్ కూడా సినిమా అంచనాలు పెంచేసింది. ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు నాగ చైతన్య. శ్రీకాకుళంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం తండేల్ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. ఆ లొకేషన్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో.. సాయి పల్లవి చాలా సింపుల్‌గా పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తోంది. ఎండలో నడచుకుంటూ వెళ్తోంది. తండేల్‌లో శ్రీకాకుళం అమ్మాయి సత్యగా నటిస్తోంది పల్లవి. అందుకే.. చాలా న్యాచురల్‌గా కనిపిస్తోంది అమ్మడు. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ తెరకెక్కుతుండగా.. గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.