తెలంగాణ రాష్ట్రంలో పలు కారణాల వల్ల భారీగా కరెంటు బిల్లులు వస్తున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఖానాపూర్లోని ఓ ఇంటికి ఏకంగా 21 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Current Bills : సాంకేతిక లోపాలతో అక్కడకక్కడా భారీగా కరెంటు బిల్లులు వస్తున్న ఘటనలను మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా చూస్తున్నాం. బుధవారం భువనగిరి జిల్లాలో ఓ ఇంటి యజానికి ఆరున్నర లక్షల కరెంటు బిల్లు వచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. నేడు దాన్ని మించి కరెంటు బిల్లు వచ్చిన ఘటన ఇది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, ఖానాపూర్‌లో ఏకంగా ఓ ఇంటికి రూ.21 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. ఈ ఊరిలో దాదాపుగా పది మందికి ఇలానే కోట్లలో కరెంటు బిల్లు(Current Bill) వచ్చినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హలందరికీ గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు కరెంటు వాడితో జీరో బిల్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కొన్ని చోట్ల కరెంటు బిల్లులు లక్షలు, కోట్లలో వస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఖానాపురంలో వేమారెడ్డి అనే పేరు మీద మీటర్ ఉంది. అది కేవలం 0.60 కిలోవాట్‌కు సంబంధించింది. అయితే సాంకేతిక లోపమో, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కాని ఈ మీటరుకు ఏకంగా రూ.21 కోట్ల కరెంటు బిల్లు(Current Bill) వచ్చింది.
ఈ మీటరుకే కాకుండా గ్రామంలో ఇలాగే పది మందికి కోట్లలో బిల్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఏఈ మహేష్ మాట్లాడారు. సాంకేతిక కారణాల వల్లనే ఇలా ఎక్కువ బిల్లులు వచ్చాయని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే బాధితులు ఫిర్యాదు చేశారని అన్నారు. దీంతో బిల్లులను సరిచేస్తున్నట్లు వెల్లడించారు.