»Sit Under Trees If You Cant Pay Electricity Bills Assam Speaker
Assam Speaker : విద్యుత్ బిల్లులు కట్టలేకపోతే చెట్ల కిందకూర్చోండి : అస్సాం స్పీకర్
ప్రజలు విద్యుత్ చార్జీలు భరించలేని స్థితిలో ఉంటే వారు ఫ్యాన్లు వాడటం మానుకోవాలని..దానికి బదులు చెట్లనీడలో కూర్చోవాలని
అస్సాం స్పీకర్ (AssamSpeaker)సలహా ఇచ్చారు
కరెంట్ బిల్లులు (Current Bills) కట్టలేకపోతే ఫ్యాన్లు బంద్ చేసి చెట్ల కిందకూర్చోవాలని అస్సాం స్పీకర్ విశ్వజిత్ దైమరీ (Speaker Vishwajit Daimary) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP) అధికారంలో ఉన్న అస్సాం రాష్ట్రం(State of Assam)లో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. కరెంట్ సరఫరాకు సంబంధించి ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం ప్రైవేటు కంపెనీల నుంచి విద్యదుత్ కొనుగోలు చేయటంతో విద్యుత్ చార్జీలు పెంచింది. స్పీకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ (Congress party) విమర్శలు గుప్పించింది. బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను తీర్చలేక ఇటువంటి అర్థం పర్థం లేని సలహాలు ఇస్తోందని ఆరోపించింది. విద్యుత్ సమస్యలు పరిష్కరించటానికి యత్నించకుండా ఇటువంటి సలహాలు ఏంటీ?ఇదేనా డబుల్ ఇంజిన్ సర్కార్ (Double engine Sarkar) పాలన అంటే…?అంటూ ప్రశ్నించింది. విద్యుత్ వాడకం తగ్గించుకోవటానికి ప్రజల్ని ఫ్యాన్లు వాడొద్దని స్పీకర్ విశ్వజిత్ దైమరీ ఉచిత సలహాలు ఇవ్వటం చూస్తే అస్సాంలో విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.