»Anand Mahindra Drove Kalki Buzzi Video Went Viral
Anand Mahindra: బుజ్జిని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్రా.. వీడియో వైరల్
ఇండస్ట్రీ అంతా ఇప్పుడు కల్కి బజ్ నడుస్తుంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. తాజాగా ఆనంద్ మహీంద్రా బుజ్జిని డ్రైవ్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.
Anand Mahindra drove Kalki Buzzi.. Video went viral
Anand Mahindra: తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు యావత్తు భారతీయ సినిమా పరిశ్రమ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అత్యంత సాంకేతిక విలువలతో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి ఇటీవలే ట్రైలర్ విడుదల అయిన సంగతీ తెలిసిందే. ప్రస్తుతం ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్‌ను తీసుకొచ్చింది. జూన్ 27న చిత్రం విడుదలకు సిద్ధం అయింది కాబట్టి మూవీ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. అందులో భాగంగా బుజ్జిని వివిధ సిటీలకు తిప్పుతున్నారు. తాజాగా ఆనంద్ మహీంద్రా కంపెనీ యజమాని సైతం బుజ్జిని డ్రైవ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.
కల్కి 2898ఏడీ చిత్రంలో బుజ్జికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆనంద్ మహీంద్రా కంపెనీ సాయంతో ఈ కారును డిజైన్ చేసినట్లు కల్కి ఈవెంట్లో చెప్పారు. ఈ కారును చూసిన ప్రతీ ఒక్కరు అవాక్కు అవుతున్నారు. తాాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సైతం బుజ్జిని డ్రైవ్ చేసీ అదే ఆనందాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి చెందిన ఇంజనీర్స్ ఈ వావనానకి సాయం చేశారని, వారు భవిష్యత్తులో రోబో వాహనాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.