»Florida Man Sneeze Hard And The Intestines Come Out
GUTS : గాట్టిగా తుమ్మితే.. పేగులు బయటకొచ్చేశాయ్!
రెస్టారెంట్లో ఉన్న ఓ వ్యక్తికి ఉన్నట్లుండి పెద్దగా తుమ్ము వచ్చింది. ఆ ఫోర్స్‌కి అతడికి కడుపులోంచి పేగులు సైతం బయటకొచ్చేశాయి. ఈ ఘటన అసలు ఎక్కడ జరిగిందంటే....?
Colon Falls Out : తుమ్ము పేగుల్ని సైతం బయటకు రప్పించగలిగినంత శక్తిని కలిగి ఉంటుందని ఓ ఘటన నిరూపించింది. న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన వివరాల ప్రకారం… అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి వయసు 63 ఏళ్లు. భార్యతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ అతనికి ఉన్నట్లుండి పెద్దగా తుమ్ము(Sneeze) వచ్చింది. ఆ కాసేపటికి అతడి పొత్తి కడుపు అంతా రక్తంతో తడిచిపోయింది. నొప్పితో విలవిల్లాడాడు. దీంతో ఏం జరిగిందే తొలుత అతడి భార్యకు అర్థం కాలేదు. అతడిని పరిశీలించి చూసింది.
అతడి పొత్తి కడుపు భాగం నుంచి పేగులు(Intestines) పొడుచుకుని బయటకు వచ్చి ఉన్నాయి. దీంతో కంగారు పడిన ఆమె అతడిని హుటాహుటిన అంబులెన్స్‌కి ఫోన్ చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు అతడిని పరీక్షించి బయటకు వచ్చిన పేగుల్ని మళ్లీ లోపలకి పెట్టి సర్జరీ చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. చాలా ఫోర్స్బుల్గా తుమ్ము రావడం వల్లనే ఇలా జరిగి ఉంటుందని వారు అభిప్రాయానికి వచ్చారు. దీంతో ఈ ఘటన గురించి విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. టైం బాగోకపోతే ఇలా తుమ్ము(Sneeze) వల్ల కూడా ఆసుపత్రి పాలు కావాల్సి వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.