»Kalki Is A Huge Event Pawan Chandrababu As Chief Guests
Kalki: ‘కల్కి’ భారీ ఈవెంట్.. ముఖ్య అతిథులుగా పవన్, చంద్రబాబు?
సలార్ తర్వాత మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 AD’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో.. భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
'Kalki' is a huge event.. Pawan, Chandrababu as chief guests?
Kalki: సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏడి మూవీని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే బుజ్జిని ప్రధాన నగరాల్లో తిప్పుతు ప్రచారం చేస్తున్నారు. బుజ్జికి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ముంబైతో పాటు పలు నగరాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట. పలు థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇక జూన్ 27న కల్కి సినిమా రిలీజ్ కానుంది. దీంతో.. రిలీజ్‌కు ముందు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారట అశ్వనీదత్. ఈ ఈవెంట్‌ను అంతకుమించి అనేలా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ఈ బిగ్ ఈవెంట్‌ను ఏపీలో నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ ఈవెంట్‌కు ఏపీ కొత్త సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరిని ముఖ్య అతిథులుగా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. టీడిపి, జనసేన, బీజెపి కూటమికి కల్కి నిర్మాత అశ్వనీదత్ సపోర్ట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రావాలని చంద్రబాబుని కోరినట్టుగా తెలుస్తోంది. అందుకు బాబు కూడా ఓకే చెప్పారని సమాచారం. ఒకవేళ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ‘కల్కి’ ఈవెంట్‌కి వస్తే.. మామూలుగా ఉండదనే చెప్పాలి. పవన్, ప్రభాస్‌ను ఒకే వేదిక మీద చూస్తే.. అభిమానులు కంట్రోల్ చేయడం కష్టం. అయితే.. ఈ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ జరగనుంది? నిజంగానే.. చంద్రబాబు, పవన్ వస్తారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.