MLC by-election: కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపు
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతొంది. పోస్టల్ బ్యాలెట్ అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేస్తున్నారు.
MLC by-election: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం నుంచి కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లతో పాటు బ్యాలెట్ పత్రాల ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ మొత్తం కౌంటింగ్ ప్రక్రియను 96 టేబుళ్లపై లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు. మే 27 న పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న, రాకేశ్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడగా ప్రేమేందర్రెడ్డి బీజేపీ పార్టీ పక్షాన బరిలో నిలుచున్నారు.
2021 మార్చిలో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించారు. ఆ సమయంలో రెండవస్థానంలో తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఇక 2023లో జరిగిన అసెంంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం తరఫున పల్లా రాజేశ్వర్రెడ్డి గెలిచారు. దీంతో ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఆ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈరోజు ఉత్కంఠబరితంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదటి ప్రాధాన్యత ఓటును లెక్కించే ప్రక్రియ కొనసాగనుంది.
నల్గొండ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ అప్డేట్
ఉదయం 8గం. నుంచి కొనసాగుతున్న బండిల్స్ కట్టే ప్రక్రియ.
మధ్యాహ్నం 2 గంటల వరకు ముగియనున్న బండిల్స్ కార్యక్రమం.
3 గంటల తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్ల తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు అవకాశం.