»Excitement Over Mlc Result Of Graduates Result Not Yet Known
Graduate MLC Bypoll: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ.. ఇంకా తేలని ఫలితం
ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం నుంచి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు తుది ఫలితం తేలలేదు. ఈరోజు సాయాంత్రానికి లెక్కించడం ముగుస్తుంది.
Excitement over MLC result of graduates.. Result not yet known
Graduate MLC Bypoll: ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం నుంచి కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను ముందుగా కట్టలు కట్టారు. ఆపై 96 టేబుళ్లపై లెక్కిస్తున్నారు. అందుకోసం 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఫలితాలు అందరిలో ఉత్కంఠ రేపుతున్నది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ తుది ఫలితం రాలేదు. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి, రెండు ప్రాధాన్యత ఓట్లు కలిపి 1,23,210 ఓట్లు వచ్చాయి. విజయం కోసం మరో 32 వేల ఓట్లు కావాలి. ఆ తరువాత బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 1,04,514 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డికి 43,486, స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్‌కు 29,776 ఓట్లు పోలయ్యాయి.
రెండో ప్రాధాన్యత ఓట్లలో 33 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాతే తుది ఫలితం వచ్చే అవకాశం ఉన్నది. మ్యాజిక్ ఫిగర్‌కు 1,55,095 ఓట్లు రావాల్సి ఉన్నది. శుక్రవారం సాయంత్రానికి రిజల్ట్ రానుంది. మే 27 న పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. 2021 మార్చిలో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించారు. 2023లో జరిగిన అసెంంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. దీంతో ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు.