»Bomb Threat Call To Vistara Flight Safe Landing In Srinagar International Airport
Bomb Threat : విస్తారా ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు రావడంతో విమానాన్ని శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో మొత్తం 178 మంది ప్రయాణికులు ఉన్నారు.
Bomb Threat : ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు రావడంతో విమానాన్ని శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో మొత్తం 178 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) శ్రీనగర్‌కు ‘బెదిరింపు కాల్’ రావడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వెంటనే CISF చర్యలు చేపట్టి విమానాశ్రయాన్ని కొంతసేపు మూసివేసింది. దీని తర్వాత విస్తారా ఎయిర్‌లైన్స్ విమానం UK611 సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఇచ్చిన సమాచారం మేరకు విమానాన్ని తనిఖీ చేయగా అందులో ఏమీ కనిపించలేదు. బెదిరింపు నకిలీగా పరిగణించబడింది. విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణంగా పునఃప్రారంభించబడ్డాయి. సేఫ్టీ ప్రోటోకాల్ ప్రకారం, విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించారు. అనంతరం విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు రెండు గంటల పాటు తనిఖీలు జరిగాయి. బాంబు నిర్వీర్య దళం, స్నిఫర్ డాగ్‌లను కూడా రంగంలోకి దించి విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు తెలిపారు. అయితే వెతికినా విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ మొత్తం ఘటన సందర్భంగా శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో అన్ని విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా తెలియరాలేదు. బాంబు బెదిరింపు మూలాన్ని అధికారులు విచారిస్తున్నారు. విమాన ప్రయాణ భద్రతను నిర్ధారించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు.