Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. OG వాయిదా?
మూవీ మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు గానీ, పవన్ ఫ్యాన్స్‌కు మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడంతో.. ఓజి వాయిదా పడినట్టేనని అంటున్నారు.
Pawan Kalyan: ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో.. పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమాగా ఓజి పై భారీ హైప్ ఉంది. ఈ సినిమాను పవన్ డై హార్డ్ ఫ్యాన్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. ఒక డై హార్డ్ ఫ్యాన్ తన హీరోకి ఎలాంటి ఎలివేషన్ ఇస్తాడో.. ఇప్పటికే గ్లింప్స్‌తో శాంపిల్ చూపించేశాడు సుజీత్. హంగ్రీ చీతా అంటూ ఇచ్చిన ఎలివేషన్ గుస్ బంప్స్ తెప్పించింది. అయితే.. ఈ సినిమాను సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. పవన్ పదిహేను నుంచి ఇరవై రోజులు డేట్స్ ఇస్తే ఓజి షూటింగ్ కంప్లీట్ కానుంది. జూన్ చివర్లో పవన్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమా డేట్ లాక్ అవడంతో.. ఓజి దాదాపుగా వాయిదా పడినట్టేనని అంటున్నారు. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్‌తో సితార ఎంటర్టైన్మెంట్స్ లక్కీ భాస్కర్ సినిమాను నిర్మిస్తోంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 27న థియేటర్లోకి రానుందని ప్రకటించారు. ఈ లెక్కన ఓజి పోస్ట్ పోన్ అయిందనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే.. లక్కీ భాస్కర్ ఓజితో పోటీ పడే ఛాన్సే లేదు. పైగా నిర్మాత నాగవంశీకి పవన్‌తో మంచి అనుబంధం ఉంది. అదిగాక త్రివిక్రమ్‌కు తెలియకుండా లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ లాక్ అయ్యే అవకాశం లేదు. ఓజి విషయంలో డివివి దానయ్య నుంచి క్లారిటీ తీసుకున్న తర్వాతే.. ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని అంటున్నారు. దీనికి తోడు నాగవంశీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రెస్ మీట్లో ఓజి వస్తే తామెందుకు వస్తామని.. కళ్యాణ్‌ది కూడా మా సొంత సినిమానే కదా.. అని అన్నారు. కాబట్టి.. ఓజి దాదాపుగా వాయిదా పడినట్టే. ఒకవేళ ఓజి వస్తే మాత్రం లక్కీ భాస్కర్ మరోసారి వాయిదా వేసుకోవాల్సిందే.