»Thats What Happened That Day Father Doesnt Like It At All Sitara
Sitara: ఆరోజు జరిగింది అదే, నాన్నకు అది అస్సలు నచ్చదు.. సితార
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తగ్గ తనయురాలిగా చిన్న ఏజ్‌లోనే దూసుకుపోతోంది సితార. చదువుకుంటునే కమర్షియల్‌గా కూడా కోట్లు సంపాదిస్తోంది. అయితే.. తాజాగా సితార తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
That's what happened that day, father doesn't like it at all.. Sitara
Sitara: సూపర్ స్టార్ కృష్ణ లెగసీని మెయింటేన్ చేస్తూ.. ఈ జనరేషన్ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ లెగసీని కంటిన్యూ చేసేందుకు.. గౌతమ్, సితార రెడీ అవుతున్నారు. ఈ విషయంలో గౌతమ్ కంటే సితార ముందు వరుసలో ఉంది. ఓ వైపు సినిమాలు, మరో వైపు యాడ్స్‌తో నేషనల్, ఇంటర్నేషన్ బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడుయ మహేష్ బాబు. తండ్రిని ఫాలో అవుతూ.. ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తింది సితార. అలాగే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార.. సర్కారు వారి పాట సినిమాలో ‘పెన్ని’ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులేసింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో డాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటుంది.
అయితే.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సితార.. తండ్రి మహేష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ మధ్య ఓ పెళ్లి వేడుకలో మహేష్ బాబు, అతని సోదరి మంజుల వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలసిందే. మహేష్హెయిర్ను పట్టుకుని.. ఏంట్రా ఇది అన్నట్టుగా మంజుల వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే ఆ వీడియోలో మంజులను మహేష్ బాబును ఏమన్నాడు? అనేది ఎవరికీ తెలియదు. ఇదే విషయాన్ని సితారను అడగ్గా.. నాన్న జుట్టు పట్టుకోవద్దు అని అత్తయ్యతో అన్నారని చెప్పుకొచ్చింది. అసలు.. జుట్టును టచ్ చేస్తే నాన్నకు అస్సలు నచ్చదు. వెంటనే కోపం వచ్చేస్తుంది. నేను మాత్రం నాన్న హెయిర్ టచ్ చేస్తూ.. అప్పుడప్పుడు ఆటపట్టిస్తూ ఉంటానని.. చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సితార కామెంట్స్ సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా.. తండ్రికి తగ్గ కూతురు అంటూ.. సితారపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.