»Married To Samantha Frustrated Naga Chaitanya Video Viral
Naga Chaitanya: సమంతతో పెళ్లి, చిరాకు పడిన నాగచైతన్య.. వీడియో వైరల్
అక్కినేని నాగ చైతన్య, సమంత గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన సరే, అది హాట్ టాపికే. లేటెస్ట్గా సమంత, చైతన్య పెళ్లి సీన్ రాగానే చైతన్య రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ మనం రీ రిలీజ్ రెస్పాన్స్ ఎలా ఉంది.
Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలు కలిసి నటించిన సినిమా ‘మనం’. ఏఎన్నార్, నాగార్జున, నాగ చైతన్యతో పాటు అఖిల్ కూడా ఈ సినిమాలో కనిపించాడు. డైరెక్టర్ విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే.. ఈ సినిమా వచ్చి దశాబ్ద కాలం పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో మనం సినిమాను రీ రిలీజ్ చేశారు. హైదరాబాద్ దేవి 70 ఎంఎంలో మనం రీ రిలీజ్ షోకి భారీగా జనాలు హాజరు అయ్యారు. ఈ క్రమంలో నాగ చైతన్య సడెన్ సర్ప్రైజ్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో థియేటర్లో సందడి నెలకొంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే.. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక చైతన్య, సమంత పెళ్లి చేసుకొని విడిపోయిన విషయం కూడా తెలిసిందే. దీంతో.. మనం సినిమా చూస్తున్న సమయంలో.. చైతన్య, సమంత సీన్స్ వచ్చినప్పుడు కేకలు పెట్టారు అభిమానులు. ముఖ్యంగా చైతూ, సామ్ పెళ్లి సీన్ వచ్చినప్పుడు రచ్చ చేశారు. దీంతో.. చైతన్య కాస్త చిరాకు పడినట్టుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి సీన్‌కి ఫ్యాన్స్ హంగామా చేస్తుండడంతో చైతు వారిని కూర్చోమని చెబుతున్నట్టుగా అందులో ఉంది. దీంతో.. చైతన్య ఈ విషయంలో ఇబ్బంది పడ్డట్టుగా వైరల్ చేస్తున్నారు కొందరు. కానీ స్క్రీన్కు అభిమానులు అడ్డు రావడంతోనే.. చైతన్య అలా చేయాల్సి వచ్చిందని కొందరు అంటున్నారు. మొత్తంగా.. మరోసారి చైతన్య, సమంత వ్యవహారం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.