ఈసారి భయం అంటే ఏంటో చూపిస్తానని.. ముందే చెప్పేశాడు కొరటాల శివ. నా హీరో చేసే మృగాల వేట మామూలుగా ఉండదని ఓపెనింగ్ రోజే చెప్పేశాడు. ఇక ఇప్పుడు ఫియర్ సాంగ్‌తో భయపెట్టడానికి రెడీ అవుతున్నాడు.
Devara: 'Devara' fear song.. Anirudh next level mass!
Devara: దేవర టీజర్లో ఎరుపెక్కిన సముద్రాన్ని చూపించి గూస్ బంప్స్ తెప్పించాడు కొరటాల శివ. ఇప్పటి వరకు దేవర నుంచి బయటికొచ్చిన ప్రతి అప్టేట్.. భయపెట్టేలానే ఉంది. ఎన్టీఆర్‌ను ఇంత మాస్‌గా చూసి ఉండరు.. అనేలా ప్రజెంట్ చేస్తున్నాడు కొరటాల శివ. అది కూడా తండ్రీ కొడుకులుగా అని అంటున్నారు. కాబట్టి.. బాక్సాఫీస్ పై టైగర్ దండయాత్ర మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇక ఈ సినిమా పై కొరటాల ఇస్తున్న హైప్ ఒకటైతే.. అనిరుధ్ పై ఉన్న అంచనాలు మాత్రం పెరుగుతునే ఉన్నాయి.
బీజిఎంతోనే బాక్సులు బద్దలు చేస్తున్న అనిరుధ్.. ఎన్టీఆర్‌కు ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ అందరిలోను ఉంది. ఇప్పటికే టీజర్‌తో శాంపిల్ చూపించిన అనిరుధ్.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్‌తో దుమ్ముదులిపేయడానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. ఓ రోజు ముందే మే 19న ఫియర్ సాంగ్ రాబోతోంది. టైటిలే ఫియర్ సాంగ్ అంటున్నారంటే.. కొరటాల దేవర సినిమాను ఎంత భయంకరంగా ప్లాన్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే ఈ సాంగ్‌ను నిర్మాత నాగ వంశీ విన్నాడట. దేవర ఫస్ట్ సాంగ్ వింటే.. హుకుమ్ సాంగ్‌ను మర్చిపోతారు అంటూ చెప్పుకొచ్చాడు. అనిరుద్ నెక్స్ట్ లెవెల్ మాస్.. అని ఎలివేషన్ ఇచ్చాడు. పైగా దేవర ముంగిట నువ్వెంత? అనే లిరిక్స్ ఉండడంతో.. ఫియర్ సాంగ్ పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఖచ్చితంగా డిజిటల్ రికార్డ్స్ అన్ని చెల్లా చెదురు అయ్యేలా.. ఈసాంగ్ ఉంటుందని నమ్ముతున్నారు. మరి అనిరుధ్ ఎలాంటి ట్యూన్ ఇచ్చాడో చూడాలి.