»Sajid Tarar We Hope That A Leader Like Modi Will Come To Us
Sajid Tarar: మోదీలాంటి నాయకుడు మాకూ రావాలని ఆశిస్తున్నాం
పాకిస్థానీ-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ ప్రధాని మోదీపై ప్రశంసలు వర్షం కురిపించారు. దేశాన్ని ఎత్తయిన శిఖరాలకు తీసుకెళ్లారని తెలిపారు. మళ్లీ మూడోసారి కూడా మోదీ అధికారంలోకి వస్తారని సాజిద్ తరార్ అన్నారు.
Sajid Tarar: We hope that a leader like Modi will come to us
Sajid Tarar: పాకిస్థానీ-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ ప్రధాని మోదీపై ప్రశంసలు వర్షం కురిపించారు. దేశాన్ని ఎత్తయిన శిఖరాలకు తీసుకెళ్లారని తెలిపారు. మళ్లీ మూడోసారి కూడా మోదీ అధికారంలోకి వస్తారని సాజిద్ తరార్ అన్నారు. పుట్టుకతోనే మోదీ అద్భుతమైన నాయకుడు అని తెలిపారు. ఆయన నాయకత్వం కేవలం భారత్‌కే కాదు.. మొత్తం ప్రపంచానికి మంచి చేస్తుందన్నారు. అనుకూల పరిస్థితుల్లో మాత్రమే కాకుండా ప్రతికూల పరిస్థితుల్లోనూ కూడా పర్యటించారు. తన రాజకీయ భవితవ్యాన్ని పణంగా పెట్టిన ఏకైక ప్రధాని అని.. మాకూ కూడా అలాంటి నాయకుడే రావాలని ఆశిస్తున్నామని తెలిపారు.
పాకిస్థాన్‌కి, భారత్‌కి శాంతియుత వాతావరణం మంచిదని సాజిద్ అన్నారు. మోదీ ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. 2024లో భారత పురోగతి అత్యద్భుతం. భవిష్యత్తులో అందరూ భారత ప్రజాస్వామ్యాన్ని చూసి నేర్చుకుంటారని సాజిత్ తరార్ తెలిపారు. 1990లో అమెరికాలో స్థిరపడిన సాజిద్ ఇప్పటికీ పాకిస్థాన్ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని సాజిద్ అన్నారు. పాకిస్థాన్‌లో సమస్యల్ని ఎలా పరిష్కరించాలి అనే దానిపై ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ఉగ్రవాదాన్ని ఎలా అదుపులోకి తేవాలి? శాంతి భద్రతలను ఎలా మెరుగుపర్చాలి? అన్న వాటి గురించి చర్చించరు. ఇలాంటి సమస్యలను తీర్చే నాయకుడు రావాలని ఆశిస్తున్న అని సాజిద్ అన్నారు.