Argentina: దేశంలోని పౌరులకు తప్పనిసరి ఓటింగ్ ప్రక్రియ అర్జెంటీనా దేశంలో కూడా ఉంది. బెల్జియం తర్వాత ఈ దేశమే ఓటింగ్‌ను తప్పనిసరి చేసింది. 112 ఏళ్ల నుంచి ఈ చట్టం కొనసాగుతోంది. అయితే ఈ దేశంలో మొదట పురుషులకు 1912 నుంచి ఓటింగ్ తప్పనిసరి చేశారు. ఆ తర్వాత 1951 నుంచి మహిళలకు ఓటు హక్కు కల్పించారు. 2012లో ఈ దేశంలో ఓటింగ్‌లో పాల్గొనే వయస్సును తగ్గించి 16-18 ఏళ్ల వాళ్లకు అవకాశం ఇచ్చారు. అయితే వీళ్లు తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకోవాలనే నిబంధన అయితే లేదు.
ఇక 18 నుంచి 70 ఏళ్ల వారు కచ్చితంగా పోలింగ్‌బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలి. వీటిని ఉల్లంఘిస్తే మూడు రకాల శిక్షలు అమల్లో ఉంటాయి. ఓటు వేయని వాళ్లు 60 రోజుల్లో తమ సహేతుక కారణాలను తెలిపాలి. ఓటర్లు చెప్పే కారణాలు నమ్మలేని విధంగా ఉంటే మాత్రం 5 నుంచి 50 డాలర్ల ఫైన్ చెల్లించాల్సిందే. అయితే ఇది చట్టంలో ఉన్నా అమలు చేయలేదు. అలాగే మూడేళ్లపాటు ప్రభు