Argentina Crypto currency influencer, billionaire deadbody in a suitcase
Crypto currency influencer: అర్జెంటీనా(Argentina)కి చెందిన క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లూయెన్సర్(Crypto currency influence), బిలియనీర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా(Fernando Perez Algaba) దారుణ హత్యకు గురయ్యాడు. గత వారం రోజులుగా ఆయన మిస్ అయ్యారు. చివరకు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లోని ఒక కాలువ పక్కన అతని మృతదేహం కనిపించింది. ముక్కలు ముక్కలుగా చేయబడిన ఆయన శరీర భాగాలున్న సూట్ కేసును గుర్తించారు. ఆ ప్రాంతంలో కొంత మంది పిల్లలు ఆడుకుంటుండగా వారికి ఒక రెడ్ కలర్ సూట్ కేస్ కనిపించింది. దాని దగ్గరకెళ్లి పరిశీలనగా చూసీ భయంతో వారి తల్లిదండ్రులకు చెప్పారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
సూట్ కేస్ తెరిచిన పోలీసులకు ముందు రెండు కాళ్లు, ఒక చేయి, శరీరంలోని కొన్ని భాగాలు కనిపించాయి. ఆ తరువాత చుట్టు పక్కల చూడడంతో కాలువ దగ్గర మరో చేయి కనిపించింది. ఆ తర్వాత తల, ఇతర భాగాలు లభించాయి. వాటిని ఒక్కదగ్గర పెట్టి చూస్తే ఆ బాడీ ఫెర్నాండో శరీరంలా కనిపించింది. వెంటనే బాడీని అటాప్సీకి పంపించగా కీలక విషయాలు వెలుగు చూశాయి. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఆయన శరీరాన్ని ముక్కలు చేశాడని తేలింది. మొదటి అతని బాడిని తుపాకితో మూడు సార్లు కాల్చారు. ఆ తరువాత ముక్కలుగా కోశారు. ఫింగర్ ప్రింట్స్, శరీరంపై ఉన్న టాటూల ఆధారంగా అది ఫెర్నాండో డెడ్ బాడీ అని నిర్ధారించారు.