»Crime Father Beats Son To Death For Losing Crores In Betting
Crime: బెట్టింగ్లో కోట్లు పోగొట్టాడని కొడుకును కొట్టి చంపిన తండ్రి
బెట్టింగ్లకు అలవాటు పడి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వీటి బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి అతనిని కొట్టి చంపేశాడు.
Crime: Father beats son to death for losing crores in betting
Crime: బెట్టింగ్లకు అలవాటు పడి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వీటికి ఎక్కువగా యువత దగ్గరవుతున్నారు. వీటి బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి అతనిని కొట్టి చంపేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరం పేట మండలం బగిరాత్పల్లిలో జరిగింది. ముకేశ్ కుమార్(28) అనే వ్యక్తి రైల్వే ఉద్యోగం చేస్తున్నాడు. బెట్టింగ్, జల్సాలకు బాగా అలవాటుపడ్డాడు.
ఇవన్నీ మానుకోవాలని తండ్రి సత్యనారాయణ చాలాసార్లు హెచ్చరించారు. అయిన వినలేదు. బెట్టింగ్లో మొత్తం రూ. కోట్లు పోగొట్టుకున్నాడు. మేడ్చల్లో ఉన్న ఇళ్లు, ప్లాటు కూడా బెట్టింగ్ కారణంగా అమ్మేశాడు. ఎంత చెప్పిన మారకపోవడంతో తండ్రి కొడుకుపై దాడి చేశాడు. ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. దీంతో కుమారుడికి తీవ్రగాయాలై చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.